నేటి బైబిల్ పఠనం: 2 సమూయేలు 9: 6-13

నా స్నేహితురాలు తెచ్చిన దారి తప్పిన కుక్కను కారు ఢీకొట్టింది. “ఇది బ్రతుకుతుంది, కానీ దాని కాలు తీసివేయాలి. మీరు యజమానినా? శస్త్రచికిత్స బిల్లు భారీగా ఉంటుంది. అది కోలుకునేంత వరకు జాగ్రత్త అవసరం ” అని పశువైద్యుడు చెప్పాడు. “నేను బాధ్యత వహిస్తాను” అని నా స్నేహితురాలు సమాధానమిచ్చింది. ఆమె చూపిన దయ ఆ కుక్కపిల్లకు ప్రేమగల ఇంట్లో భవిష్యత్తును ఇచ్చింది.

మెఫిబోషెతు తనను తాను “చచ్చిన కుక్క”వంటి వాడిగా, అనుగ్రహానికి అనర్హుడిగా అనుకున్నాడు (2 సమూయేలు 9: 8). ఒక ప్రమాదం కారణంగా రెండు పాదాలు కుంటితనంతో ఉండటం వలన అతను తన రక్షణ మరియు సంరక్షణ కోసం ఇతరులపై ఆధారపడ్డాడు (చూడండి 4: 4). ఇంకా, అతని తాత, రాజైన సౌలు మరణం తరువాత, ఆ రోజుల్లో అనుసరించే పద్దతి ప్రకారం కొత్త రాజైన దావీదు శత్రువులను, సింహాసనానికి పోటీదారులైన వారిని చంపడానికి ఆదేశిస్తాడని అతను బహుశా భయపడ్డాడు.

అయినప్పటికీ, దావీదు తన స్నేహితుడైన యోనాతానుపై ప్రేమతో, యోనాతాను కుమారుడైన మెఫిబోషెతును తన సొంత కుమారుడిగా, ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండేలా చూసుకున్నాడు (9: 7). అదే విధంగా, ఒకప్పుడు దేవుని శత్రువులుగా, మరణానికి గుర్తుగా ఉన్న మనం, యేసు ద్వారా రక్షించబడ్డాము, పరలోకములో ఆయనతో శాశ్వతంగా స్థానం పొందాము. లూకా తన సువార్తలో వివరించిన దేవుని రాజ్యంలో, విందులో భోజనం చేయడం అంటే ఇదే (లూకా 14:15). ఇక్కడ మనం ఒక రాజు కుమారులం మరియు కుమార్తెలం! మనం ఎంత అనర్హమైన అధిక దయను పొందాము! కృతజ్ఞత, సంతోషాలతో దేవునికి దగ్గరవుదాం.

కరెన్ క్వెక్

దేవుడు మిమ్మల్ని సంరక్షిస్తాడు, మీ పట్ల శ్రద్ద వహిస్తాడు అని మీరు ఎప్పుడు మర్చిపోయే అవకాశం ఉంది? అలాంటి సమయాల్లో 2 సమూయేలు 9: 6-13 మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తుంది?

ప్రియమైన యేసు, నన్ను కాపాడినందుకు, మీ బల్ల వద్ద ఎప్పటికీ నాకు చోటు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను మీ ప్రియమైన బిడ్డ, అని నాకు గుర్తు చేయండి, మరియు మిమ్మల్ని ఎల్లప్పుడూ స్తుతించడానికి, విశ్వసించడానికి నాకు సహాయం చేయండి.

తెలుగులో మా అనుదిన ఆహారము 2022 వార్షిక ముద్రణతో, మరిన్నీ ధ్యానాంశములను ఎక్కువగా చదవండి మరియు ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని ధ్యానించండి. కేవలం 150 రుపాయలలో, ప్రతిరోజూ స్థిరంగా ప్రభువును వెతకడంలో అర్థవంతమైన మార్గాన్ని అందిస్తూ ఇది మీకు సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, మీ పరిస్థితి ఏమైయునప్పటికీ, ప్రతిరోజూ ఆయనతో సమయం గడపడం ద్వారా మిమ్మల్ని మీరు కోరుకునే వ్యక్తిగా మార్చుకోగలరు!