ఒక సంవత్సరంలో బైబిల్యె: హెజ్కేలు 11–13; యాకోబు 1

2006 లో, మా నాన్నకు నాడీ సంబంధిత వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది, అది ఆయన జ్ఞాపకశక్తి, మాటలు అలాగే శరీర కదలికలపై నియంత్రణను కోల్పోయేలా చేసింది. ఆయన 2011 లో మంచం పట్టాడు అలాగే ఇంట్లో మా అమ్మ సంరక్షణను కొనసాగిస్తోంది. ఆయన అనారోగ్యం ప్రారంభం ఒక చీకటి సమయం. నేను భయపడ్డాను: అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని చూసుకోవడం గురించి నాకు ఏమీ తెలియదు, మరియు నేను ఆర్ధిక అలాగే మా అమ్మ ఆరోగ్యం గురించి చింతిస్తూ ఉన్నాను.

విలాపవాక్యములు 3:22 లోని మాటలు నా హృదయ స్థితి వలె బూడిద రంగు కాంతిలాగ ఉన్న చాలా ఉదయాలలో లేవటానికి నాకు సహాయపడ్డాయి: “ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.” “నిర్మూలము” అనే హీబ్రూ పదానికి “పూర్తిగా వినియోగించుకోవడం” లేదా “ముగింపుకు రావడం” అని అర్ధం.

దేవుని గొప్ప ప్రేమ మన రోజును ఎదుర్కోవడానికి, ముందుకు సాగడానికి అనుమతిస్తుంది. మన పరీక్షలు చాలా పెద్దవిగా అనిపించవచ్చు, కానీ దేవుని ప్రేమ చాలా గొప్పది కనుక మనం వాటి ద్వారా నాశనం చేయబడము!

నా కుటుంబానికి దేవుడు తన నమ్మకమైన, ప్రేమపూర్వకముగా చూపించిన మార్గాలను నేను చాలా సార్లు గుర్తుచేసుకోగలను. ఆయన అనుగ్రహమును బంధువులు అలాగే స్నేహితుల దయలో, వైద్యుల జ్ఞానముగల సలహాలో, ఆర్థిక సదుపాయంలో అలాగే – ఒక రోజు నా తండ్రి మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో పరలోకంలో ఉంటారు అని మా మా హృదయాల యొక్క జ్ఞాపకం చేయడంలో నేను చూశాను.

మీరు చీకటి సమయాన్ని అనుభవిస్తున్నట్లయితే, ఆశను కోల్పోకండి. మీరు ఎదుర్కొంటున్న దానితో మీరు నిర్మూలము కాలేరు. మీ కోసమైన దేవుని నమ్మకమైన ప్రేమ అలాగే ఏర్పాటుపై నమ్మకం ఉంచండి.

-కరెన్ హువాంగ్

కష్టాల మధ్యలో, మీరు బలం కోసం ఎక్కడికి వెళ్తారు? దేవుని గొప్ప ప్రేమను విశ్వసించమని మిమ్మల్ని మీరు ఎలా గుర్తు చేసుకోగలరు?

తండ్రీ, మిమ్మల్నిఎల్లప్పుడు విశ్వసించడంలో నాకు సహాయపడండి. మీ ప్రేమ అలాగే విశ్వాసాన్ని చూచులాగున నా కళ్ళు తెరవండి.

తెలుగులో మా అనుదిన ఆహారము 2022 వార్షిక ముద్రణతో, మరిన్నీ ధ్యానాంశములను ఎక్కువగా చదవండి మరియు ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని ధ్యానించండి. కేవలం 150 రుపాయలలో, ప్రతిరోజూ స్థిరంగా ప్రభువును వెతకడంలో అర్థవంతమైన మార్గాన్ని అందిస్తూ ఇది మీకు సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, మీ పరిస్థితి ఏమైయునప్పటికీ, ప్రతిరోజూ ఆయనతో సమయం గడపడం ద్వారా మిమ్మల్ని మీరు కోరుకునే వ్యక్తిగా మార్చుకోగలరు!