ఒక సంవత్సరంలో బైబిల్యె: హెజ్కేలు 22–23; 1 పేతురు 1

దేవుని చిత్తాన్ని అనుసరించడం కొన్నిసార్లు కష్టం. సరైన పనులు చేయమని ఆయన మనల్ని అడుగుతారు. ఫిర్యాదు చేయకుండా కష్టాలను భరించమని, ఇబ్బందిపరిచే వ్యక్తులను ప్రేమించమని, “నీవు చేయకూడదు అని అనుకున్నవాటిని చేయవద్దు అని చెప్పే మెల్లనైన స్వరాన్ని” వినమని ఆయన మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి, “ఓ ప్రాణమా వినుము, నిశ్శబ్దంగా ఉండి, యేసు నిన్ను ఏమి చేయమని అడుగుతున్నారో అది చేయు.” అని మనం రోజంతా మన ఆత్మతో చెప్పాలి.

“నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది” (కీర్తన 62:1). “నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ” (62:5). ఈ వచనాలు ఒకేలాగా ఉంటాయి, కానీ భిన్నమైనవి. దావీదు తన ప్రాణము గురించి ఏదో చెబుతున్నాడు; అతని ప్రాణముతో ఏదో చెబుతున్నాడు.”మౌనముగా వేచి నుండుట” ఒక నిర్ణయాన్ని, స్థిరపడిన మన్సస్తత్వాన్ని సూచిస్తుంది. “మౌనముగా నుండుము” అనే నిర్ణయాన్ని గుర్తుంచుకోవడానికి దావీదు తన ప్రాణమును ప్రేరేపిస్తున్నాడు.

దావీదు మౌనముగా జీవించాలని నిర్ణయించుకున్నాడు -ఇది దేవుని చిత్తానికి మౌనముగా సమర్పించడం. ఇది మన పిలుపు కూడా, దానికై మనం సృష్టించబడినాము. “నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక” (లూకా 22:43) అని మనము అంగీకరించినప్పుడు ప్రశాంతంగా ఉంటాము. మనము ఆయనను ప్రభువుగా చేసికున్నప్పుడు ఇది మన మొదటి అలాగే అత్యున్నతమైన పిలుపు ఇంక మన లోతైన ఆనందానికి మూలం. “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము” అని కీర్తనకారుడు చెప్పాడు (కీర్తన 40: 8).

మనము ఎల్లప్పుడూ దేవుని సహాయం కోసం అడగాలి, వాస్తవానికి, “ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది.” (62: 5). మనము ఆయన సహాయం కోరినప్పుడు, ఆయన దానిని అందజేస్తారు. దేవుడు చేయని లేదా చేయలేనిది ఏదైనా చేయమని మనల్ని ఎప్పుడూ అడగరు .

డేవిడ్ రోపర్

మీకు దేవుని చిత్తం కష్టం అని మీరు ఎప్పుడు భావించారు? మీరు మౌన సమర్పణలో ఎలా జీవించగలరు?

తండ్రీ, మీ చిత్తాన్ని నేను ఎల్లప్పుడూ అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దానికి సమర్పించుకోవడానికి నాకు సహాయం చేయమని అడుగుతున్నాను. మీ మంచి అలాగే నమ్మకమైన స్వభావాన్ని విశ్వసించడానికి నాకు నేర్పుము. నాకు సమర్పణ హృదయాన్ని ఇవ్వండి.

తెలుగులో మా అనుదిన ఆహారము 2022 వార్షిక ముద్రణతో, మరిన్నీ ధ్యానాంశములను ఎక్కువగా చదవండి మరియు ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని ధ్యానించండి. కేవలం 150 రుపాయలలో, ప్రతిరోజూ స్థిరంగా ప్రభువును వెతకడంలో అర్థవంతమైన మార్గాన్ని అందిస్తూ ఇది మీకు సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, మీ పరిస్థితి ఏమైయునప్పటికీ, ప్రతిరోజూ ఆయనతో సమయం గడపడం ద్వారా మిమ్మల్ని మీరు కోరుకునే వ్యక్తిగా మార్చుకోగలరు!