నేటి బైబిల్ పఠనం: రోమీయులకు 6: 16-23

నా తల్లి ఆకస్మిక మరణం తరువాత, నేను బ్లాగింగ్ ప్రారంభించడానికి ప్రేరణ పొందాను. భూమిపై ముఖ్యమైన జీవిత క్షణాలను సృష్టించడానికి వారి సమయాన్ని ఉపయోగించేలా ప్రజలను ప్రేరేపించే పోస్ట్‌లను నేను రాయాలనుకున్నాను. నేను బ్లాగింగ్ కోసం ఒక ప్రారంభ మార్గదర్శి(బిగినర్స్ గైడ్‌)ని ఆశ్రయించాను. నేను ఏ వేదికని ఉపయోగించాలో, శీర్షిక ఎలా ఎంచుకోవాలో, ఆకర్షణీయమైన పోస్ట్‌లను ఎలా రూపొందించాలో నేర్చుకున్నాను. 2016 లో నా మొదటి బ్లాగ్ పోస్ట్ చేశాను.

నిత్య జీవాన్ని ఎలా పొందాలో వివరించడానికి పౌలు”ప్రారంభ మార్గదర్శి” వ్రాసాడు. రోమీయులకు 6: 16-18 లో, మనమందరం దేవునికి విరోధముగా (పాపములో) జన్మించాము అనే వాస్తవాన్ని, యేసు “[మన] పాపం నుండి విముక్తి పొందడానికి” మనకు సహాయం చేయగలడనే సత్యంతో పౌలు పోల్చి చెప్పాడు (వ.18). పౌలు పాపానికి బానిసగా ఉంటూ, లేదా దేవునికి సేవకునిగా ఉంటూ జీవితాన్ని అప్పగించే మార్గాల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తున్నాడు (వ.లు 19-20). అతను “పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము” అని పేర్కొంటూ కొనసాగించాడు(వ.23). మరణం అంటే దేవుని నుండి శాశ్వతంగా విడిపోవడం. మనం క్రీస్తును తిరస్కరించినప్పుడు మనం ఎదుర్కొనే వినాశకరమైన ఫలితం ఇది. కానీ దేవుడు మనకు యేసులో కొత్త జీవితం బహుమతిగా అందించాడు. ఇది భూమిపై ప్రారంభమయ్యే జీవితం మరియు ఆయనతో పరలోకములో ఎప్పటికీ కొనసాగుతుంది.

శాశ్వత జీవితానికి పౌలు యొక్క ప్రారంభ మార్గదర్శకం మనకు రెండు ఎంపికలు ఇస్తుంది-పాపాన్ని ఎంచుకుంటే అది మరణానికి దారితీస్తుంది లేదా యేసు ఇచ్చే బహుమతిని ఎంచుకుంటే ఇది శాశ్వత జీవితానికి దారితీస్తుంది. మీరు ఆయన జీవిత బహుమతిని స్వీకరించండి, మీరు ఇప్పటికే క్రీస్తును అంగీకరించినట్లయితే, ఈ రోజు మీరు ఈ బహుమతిని ఇతరులతో పంచుకోవచ్చు!

మార్విన్ విలియమ్స్

యేసు క్రీస్తు ద్వారా శాశ్వత జీవిత ఉచిత బహుమతిని అందుకోవడం అంటే ఏమిటో మీరు ఎలా వివరిస్తారు? పాపానికి బానిసగా, లేదా దేవునికి సేవకునిగా జీవితాన్ని అప్పగించే మార్గాలలో తేడా ఏమిటి?

యేసు, నన్ను ప్రేమించినందుకు మరియు నన్ను క్షమించినందుకు ధన్యవాదాలు. నేను చెల్లించలేని రుణాన్ని మీరు చెల్లించి, నాకు కొనలేని దానిని బహుమతిగా ఇచ్చారు.

తెలుగులో మా అనుదిన ఆహారము 2022 వార్షిక ముద్రణతో, మరిన్నీ ధ్యానాంశములను ఎక్కువగా చదవండి మరియు ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని ధ్యానించండి. కేవలం 150 రుపాయలలో, ప్రతిరోజూ స్థిరంగా ప్రభువును వెతకడంలో అర్థవంతమైన మార్గాన్ని అందిస్తూ ఇది మీకు సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, మీ పరిస్థితి ఏమైయునప్పటికీ, ప్రతిరోజూ ఆయనతో సమయం గడపడం ద్వారా మిమ్మల్ని మీరు కోరుకునే వ్యక్తిగా మార్చుకోగలరు!