నేటి బైబిల్ పఠనం: ద్వితీయోపదేశకాండము 5:28-33

కౌమార సంవత్సరములు అనేది కొన్నిసార్లు తల్లితండ్రుల మరియు పిల్లల జీవితాల్లో అత్యంత బాధాకరమైన కాలాల్లో ఒకటి. వారి ఉద్దేశ్యములు నన్ను దుర్భరపరిచేలా ఉన్నాయనే అనుమానంతో నా కౌమారదశలో నా తల్లి నుండి “వ్యక్తిగతీకరించకోవడానికి” , నేను ఆమె విలువలను బహిరంగంగా తిరస్కరించాను, ఆమె నియమాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసాను. మేము ఆ విషయాలపై అంగీకరించినప్పటికీ, మా సంబంధంలో ఆ సమయం ఉద్రిక్తతతో కూడుకున్నది. ఆమె తెలివైన సూచనలను వినడానికి నేను నిరాకరించినందుకు, తెలిసి తెలిసి నన్ను అనువసరమైన భావోద్వేగ మరియు శారీరక బాధలలో వదిలి వేస్తున్నామని, అమ్మ నిస్సందేహంగా విలపించింది.

దేవుడు తన బిడ్డలైన ఇశ్రాయేలీయుల కోసం అదే హృదయాన్ని కలిగి ఉన్నాడు. పది ఆజ్ఞలుగా మనకు తెలిసిన వాటిలో జీవించడానికి దేవుడు తన జ్ఞానాన్ని ప్రసాదించాడు (ద్వితీయోపదేశకాండము 5:7-21). వాటిని నియమాల జాబితాగా చూడగలిగినప్పటికీ, దేవుని ఉద్దేశ్యం మోషేతో ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది: “వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు” (వ.29). మోషే దేవుని కోరికను గుర్తించి, ఆ ఆజ్ఞలకు విధేయత చూపాలని తద్వారా వాగ్దానం చేసిన భూమిలో వారితో దేవుని నిరంతర ఉనికిని వారు ఆనందిస్తారు అని చెప్పాడు (వ.33).

ఆయన మార్గదర్శకాలు నిజంగా మన మంచి కోసమే అని విశ్వసించకుండా మనమందరం దేవునితో “కౌమారదశ” కాలం గడుపుతాము, . మనకి ఏది ఉత్తమమో ఆయన కోరుకుంటున్నట్లు గ్రహించి, ఆయన అందించే జ్ఞానాన్ని పాటించడం నేర్చుకుందాం. మనం మరింతగా యేసు వలె మారడానికి ఆయన మార్గదర్శకత్వం మనల్ని ఆధ్యాత్మిక పరిపక్వతలోకి నడిపించడానికి ఉద్దేశించబడింది (కీర్తనలు 119:97-104; ఎఫెసీయులకు 4:15, 2 పేతురు 3:18).

కర్ స్టన్ హోమ్ బర్గు

దేవునితో మీకు గల సంబంధంలో మీరు ఎదగడానికి దేవుని జ్ఞానం మీకు ఎలా సహాయపడింది? మీ జీవితంలోని ఏ విషయంలో మీరు ఆయన జ్ఞానాన్ని లక్ష్యపెట్టాలి?

ప్రేమగల దేవా, నాకు ఏది ఉత్తమమో నీకు తెలుసు అని నమ్మడానికి నాకు సహాయపడండి.

తెలుగులో మా అనుదిన ఆహారము 2022 వార్షిక ముద్రణతో, మరిన్నీ ధ్యానాంశములను ఎక్కువగా చదవండి మరియు ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని ధ్యానించండి. కేవలం 150 రుపాయలలో, ప్రతిరోజూ స్థిరంగా ప్రభువును వెతకడంలో అర్థవంతమైన మార్గాన్ని అందిస్తూ ఇది మీకు సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, మీ పరిస్థితి ఏమైయునప్పటికీ, ప్రతిరోజూ ఆయనతో సమయం గడపడం ద్వారా మిమ్మల్ని మీరు కోరుకునే వ్యక్తిగా మార్చుకోగలరు!