ఒక సంవత్సరంలో బైబిల్యె: యెహెఙ్కేలు 35–36; 2 పేతురు 1

క్రీస్తుపై నమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ఫిలిప్పీన్స్‌లోని ఒక తెగలో పెరిగిన ఎస్తేర్, ప్రాణాంతక అనారోగ్యంతో ఎస్తేర్ పోరాటంలో ఆమె కోసం అత్త ప్రార్థించిన తర్వాత యేసు ద్వారా రక్షణ పొందింది. నేడు, ఎస్తేర్ తన స్థానిక సమాజంలో హింస అలాగే మరణం యొక్క బెదిరింపులు ఉన్నప్పటికీ బైబిల్ అధ్యయనాలను నడిపిస్తుంది. ఆమె సంతోషంగా సేవ చేస్తూ అంటుంది, “నా జీవితంలో నేను దేవుని శక్తి, ప్రేమ, మంచితనం అలాగే విశ్వాసాన్ని అనుభవించినందున నేను యేసు గురించి ప్రజలకు చెప్పడం ఆపలేను” అని.

వ్యతిరేకత ఎదురైనప్పుడు దేవునికి సేవ చేయడం నేడు చాలామందికి బబులోనులో బందిఖానాలో నివసిస్తున్న ముగ్గురు యువ ఇశ్రాయేలీయులు షద్రకు మేషాకు అలాగే అబేద్నెగోలకు లాగనే వాస్తవమైనది. దానియేలు పుస్తకంలో, చంపేస్తానని బెదిరించినప్పటికీ వారు రాజగు నెబుకద్నెజరు యొక్క పెద్ద బంగారు ప్రతిమకు నమస్కరించుటకు నిరాకరించారని మనము తెలుసుకున్నాము. దేవుడు తమను కాపాడగలడని ఆ మనుష్యులుసాక్ష్యమిచ్చారు, ఆయన “రక్షించకపోయినను” వారు ఆయనను సేవించటానికే ఎంచుకున్నారు (దానియేలు 3:18). వారు అగ్నిలో పడవేయబడినప్పుడు, దేవుడు వారి బాధలో వారితో కలిసిపోయారు (వ. 25). అందరిని ఆశ్చర్యపరిచే విధంగా, వారు “వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోలేదు” (వ. 27).

విశ్వాసం యొక్క కార్యం కోసం మనం బాధ లేదా హింసను ఎదుర్కొంటుంటే, “మనం ఆశించిన దానికంటే భిన్నంగా మారినప్పటికీ” ప్రాచీన అలాగే ఆధునిక ఉదాహరణలు మనకు గుర్తుచేస్తాయి- మనం ఆయనకు విధేయత చూపడానికి ఎంచుకున్నప్పుడు, మనల్ని బలోపేతం చేయడానికి అలాగే నిలబెట్టడానికి దేవుని ఆత్మ మనతో ఉంటారు అని.

లీసా సమ్రా

దేవుడిని అనుసరించడానికి మీరు ఎంచుకున్న కొన్ని మార్గాలు ఏమిటి? ఆయన ఏ మార్గాలలో మీతో ఉన్నారు?

దేవా, నన్ను చాలా ఉదారంగా ప్రేమించినందుకు ధన్యవాదాలు. వ్యతిరేకత ఉన్నప్పటికీ సంతోషంతో మిమ్మును అనుసరించడానికి నాకు సహాయం చెయ్యండి.

తెలుగులో మా అనుదిన ఆహారము 2022 వార్షిక ముద్రణతో, మరిన్నీ ధ్యానాంశములను ఎక్కువగా చదవండి మరియు ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని ధ్యానించండి. కేవలం 150 రుపాయలలో, ప్రతిరోజూ స్థిరంగా ప్రభువును వెతకడంలో అర్థవంతమైన మార్గాన్ని అందిస్తూ ఇది మీకు సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, మీ పరిస్థితి ఏమైయునప్పటికీ, ప్రతిరోజూ ఆయనతో సమయం గడపడం ద్వారా మిమ్మల్ని మీరు కోరుకునే వ్యక్తిగా మార్చుకోగలరు!