నేటి బైబిల్ పఠనం: కీర్తనలు 32: 1-5; మత్తయి 7: 1-5
నేను యుక్తవయసులో ఉన్నప్పుడు, మా అమ్మ మా గది గోడపై ఒక చిత్రాన్ని చిత్రించింది, అది చాలా సంవత్సరాలు అక్కడే ఉంది. ఆ చిత్రం ఒక శిధిల దేవాలయం, దానికిరువైపులా పడియున్న తెల్లటి స్తంభాలు, శిథిలమైన కొలను మరియు విరిగిన విగ్రహంతో ఒక పురాతన గ్రీకు దృశ్యాన్ని చూపిస్తుంది.ఆ చిత్రాన్ని చూస్తున్నప్పుడు, ఒకప్పుడు గొప్ప అందాన్ని కలిగి ఉన్న హెలెనిస్టిక్ నిర్మాణశైలిని చూసాను. దానిని నాశనం చేయడానికి గల కారణాలను ఊహించడానికి నేను ప్రయత్నించాను. ప్రత్యేకించి ఒకప్పుడు గొప్పగా అభివృద్ధి చెందుతూ, అంతర్గతంగా క్షీణించి కుప్పకూలిపోయిన, నాగరికతల విషాదం గురించి అధ్యయనం చేయడం ప్రారంభించినప్పుడు నేను ఆసక్తిగా ఉన్నాను.
ఈ రోజు మన చుట్టూ చూస్తున్న పాపపు చెడునడత, హింసాత్మక వినాశనం మనకు ఆందోళన కలిగిస్తాయి. దేవుడిని తిరస్కరించిన వ్యక్తులను, దేశాలను సూచించడం ద్వారా మనం దానిని వివరించడానికి ప్రయత్నించడం సహజం. కానీ మనం మన దృష్టితో అంతర్గతంగా చూడకూడదా? మన హృదయంలో లోతుగా పరిశీలించకుండా, ఇతరులు తమ పాప మార్గాల నుండి తప్పుకోవాలని పిలుపునిచ్చినప్పుడు మనం వంచకులుగా ఉండడం గురించి లేఖనం హెచ్చరిస్తుంది (మత్తయి 7: 1-5).
కీర్తనలు 32వ అధ్యాయం మన స్వంత పాపాన్ని చూసి ఒప్పుకోమని సవాలు చేస్తుంది. మన వ్యక్తిగత పాపాన్ని గుర్తించి, ఒప్పుకున్నప్పుడే మనం అపరాధం నుండి స్వేచ్ఛను, నిజమైన పశ్చాత్తాపం యొక్క ఆనందాన్ని అనుభవించవచ్చు (వ.లు 1-5). దేవుడు మనకు పూర్తి క్షమాపణ ఇస్తాడని తెలుసుకొని మనం సంతోషించినప్పుడు, పాపంతో పోరాడుతున్న ఇతరులతో ఆ క్షమాపణకు సంబంధించిన ఆశను పంచుకోవచ్చు.
సిండీ హెస్ కాస్పర్
మీ జీవితంలో పాపాన్ని గుర్తించడానికి మొదటి అడుగు ఏమిటి? మీరు మీ పాపాన్ని దేవునితో ఒప్పుకోవడం ఎందుకు ప్రాముఖ్యమైనది?
తండ్రీ దేవుడా, నా పాపం యొక్క అపరాధాన్ని తొలగించే మీ క్షమాపణ బహుమతికి ధన్యవాదాలు. ఇతరుల పాపాల గురించి నేను ఆందోళన చెందడానికి ముందు మొదట నా హృదయాన్ని పరీక్షించుకోవడానికి నాకు సహాయపడండి.
తెలుగులో మా అనుదిన ఆహారము 2022 వార్షిక ముద్రణతో, మరిన్నీ ధ్యానాంశములను ఎక్కువగా చదవండి మరియు ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని ధ్యానించండి. కేవలం 150 రుపాయలలో, ప్రతిరోజూ స్థిరంగా ప్రభువును వెతకడంలో అర్థవంతమైన మార్గాన్ని అందిస్తూ ఇది మీకు సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, మీ పరిస్థితి ఏమైయునప్పటికీ, ప్రతిరోజూ ఆయనతో సమయం గడపడం ద్వారా మిమ్మల్ని మీరు కోరుకునే వ్యక్తిగా మార్చుకోగలరు!