ఒక సంవత్సరంలో బైబిల్యి: యిర్మియా 20-21; 2 తిమోతి 4
యువకుడైన ముఠా నాయకుడు కేసి, అతని అనుచరులు ఇళ్ళు, కార్లు, సౌకర్యవంతమైన దుకాణాలలోకి చొరబడి దోచుకుంటారు. ఇతర ముఠాలతో గొడవలు పడుతూ ఉంటారు. చివరికి, కేసిని అరెస్టు చేసి శిక్ష విధించారు. అల్లర్ల సమయంలో ఇంట్లో చేసిన కత్తులు అందించినవాడు, జైలులో “నియంత” అయ్యాడు.
కొంతకాలం తర్వాత, అతడిని ఒంటరిగా ఉంచారు. తన జైలు గదిలో పగటి కలలు కంటున్నప్పుడు, కేసి తన జీవితంలోని కీలక సంఘటనలను, యేసు జీవితంలోని ముఖ్య సంఘటనలను కలల చిత్రం ద్వారా మరల మరల చూసుకుంటూ ఉండగా యేసు సిలువ పై మేకులతో కొట్టబడి, “నేను మీ కోసం దీన్ని చేస్తున్నాను.” అని యేసు చెప్పిన మాటలను విన్నాడు. కేసి నేలపై పడి ఏడుస్తూ తన పాపాలను ఒప్పుకున్నాడు. తరువాత, అతను తన అనుభవాన్ని ఒక మత ప్రచారకునితో పంచుకున్నాడు, అతను యేసు గురించి మరింత వివరించి అతనికి బైబిల్ ఇచ్చాడు. “అది నా విశ్వాసప్రయాణానికి ప్రారంభం” అని కేసి అన్నాడు. చివరికి, అతను ఒంటరిగా ఉండే జైలు గది నుండి, ప్రధాన జైలు జనాభాలోకి విడుదల చేయబడ్డాడు, అక్కడ అతను తన విశ్వాసం గురించి ఇతర ఖైదీల నుండి దురుసు ప్రవర్తనను ఎదుర్కొన్నాడు. కానీ అతను ప్రశాంతంగా ఉన్నాడు, ఎందుకంటే “[అతను] యేసుని గురించి ఇతర ఖైదీలకు చెప్పాలని కొత్త పిలుపును అందుకున్నాడు.”
తిమోతికి రాసిన లేఖలో, అపొస్తలుడైన పౌలు జీవితాలను మార్చే క్రీస్తు శక్తి గురించి మాట్లాడాడు: దేవుడు మనల్ని తప్పుడు జీవితాల నుండి యేసును అనుసరించి సేవ చేయడానికి పిలుస్తాడు (2 తిమోతి 1: 9). మనం విశ్వాసంతో ఆయనను స్వీకరించినప్పుడు, మనం క్రీస్తు ప్రేమకు సజీవ సాక్షిగా ఉండాలనేది ఆయన కోరిక. పరిశుద్ధాత్మ మనలను సువార్తను పంచుకోవాలనే తపనతో, బాధల్లో ఉన్నప్పుడు కూడా సజీవ సాక్షిగా నిలబడేలా చేయగలదు(వ.8). కేసి లాగా మనం కొత్త పిలుపులో జీవిద్దాం.
ఆల్యోసన్ కీదా
మీరు ఎవరితో సువార్తను ఎప్పుడు పంచుకున్నారు? దాని ఫలితం ఏమిటి? అది ఎప్పుడైనా బాధకు దారితీసిందా? ఏం జరిగింది?
ప్రియమైన దేవా, నీ కుమారుని ద్వారా మాకు కొత్త పిలుపునిచ్చినందుకు ధన్యవాదాలు. సేవలో పాల్గొనేందుకు మార్గనిర్దేశం చేయడానికి, శక్తినివ్వడానికి మాలో నివసించే ఆత్మను ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
తెలుగులో మా అనుదిన ఆహారము 2022 వార్షిక ముద్రణతో, మరిన్నీ ధ్యానాంశములను ఎక్కువగా చదవండి మరియు ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని ధ్యానించండి. కేవలం 150 రుపాయలలో, ప్రతిరోజూ స్థిరంగా ప్రభువును వెతకడంలో అర్థవంతమైన మార్గాన్ని అందిస్తూ ఇది మీకు సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, మీ పరిస్థితి ఏమైయునప్పటికీ, ప్రతిరోజూ ఆయనతో సమయం గడపడం ద్వారా మిమ్మల్ని మీరు కోరుకునే వ్యక్తిగా మార్చుకోగలరు!