ఒక సంవత్సరంలో బైబిల్వి: విలాపవాక్యములు 1–2; హెబ్రీయులకు 10:1-18

ప్రిస్ తండ్రి, పాస్టర్, ఇండోనేషియాలోని ఒక చిన్న ద్వీపంలో ఒక మిషన్‌కు మార్గదర్శకత్వం వహించాలనే దేవుని పిలుపుకు సమాధానమిచ్చినప్పుడు, ప్రిస్ కుటుంబం ఒకసారి జంతువులను ఉంచడానికి ఉపయోగించిన పల్లపులో నివసిస్తున్నట్లు కనుగొన్నారు. ప్రిస్ నేలపై కూర్చొని, పైకప్పు వర్షపు నీరు గడ్డితో కప్పబడి ఉండగా క్రిస్మస్ వేడుకను స్తుతులు పాడుతు జరుపుకున్నట్లు ప్రిస్ గుర్తు చేసుకుంది. కానీ ఆమె తండ్రి “ప్రిస్, మనం పేదవాళ్లం కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించడంలేదని కాదు” అని ఆమెకు గుర్తు చేశారు.

కొందరు దేవుడు దీవించిన జీవితమంటే సంపద, ఆరోగ్యం ఇంక దీర్ఘాయువుతో నిండినట్లుగా చూడవచ్చు. కాబట్టి వారు కష్ట సమయాల్లో, ఇంకా ఆయన ప్రేమిస్తున్నారా అని వారు ఆశ్చర్యపోవచ్చు. కానీ రోమా 8: 31-39లో, శ్రమయైనను బాధయైనను హింసయైనను కరువైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను- యేసు ప్రేమ నుండి మనల్ని ఏదీ వేరు చేయలేదని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు (వ.35). ఇది నిజముగా ఆశీర్వదించబడిన జీవితానికి పునాది: దేవుడు తన కుమారుడైన యేసును మన పాపాల కొరకు మరణించుటకు పంపడం ద్వారా మనపై తన ప్రేమను చూపించారు (వ. 32). క్రీస్తు మరణం నుండి లేచారు ఇంక ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నారు, మన కోసం విజ్ఞాపనము కూడ చేస్తున్నారు (వ.34).

బాధా సమయాల్లో, క్రీస్తు మన కొరకు చేసిన దానిపైనే మన జీవితం నిలిచియుందన్న ఓదార్పుకరమైన సత్యాన్ని మనం గట్టిగా పట్టుకోవచ్చు. “మరణమైనను జీవమైనను . . . సృష్టింపబడిన మరి ఏదైనను,”(వ.లు. 38-39) – దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవు. మన పరిస్థితి ఏమైనప్పటికీ, మన కష్టాలు ఏమైనప్పటికీ, దేవుడు మనతో ఉన్నాడు అలాగే మనల్ని ఆయన నుండి ఏదియు వేరు చేయలేదని మనం గుర్తుచేసుకుందాం.

యోహన్న సూర్యని హెచ్.

యేసు ప్రేమ నుండి ఏదీయు మిమ్మల్ని వేరు చేయలేదని మీరు ఎలా గుర్తు చేసుకుంటారు? ఈ సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు జీవిత సవాళ్లకు ప్రతిస్పందించే విధానాన్ని ఎలా మార్చగలదు?

పరలోకపు తండ్రీ, మీ ప్రేమను మరింతగా అర్థం చేసుకోవడానికి నా మనోనేత్రాలు అలాగే హృదయాన్ని తెరవండి అలాగే నా జీవితానికి మీ ప్రేమయే సరిపోతుందని గ్రహించడంలో నాకు సహాయపడండి.

తెలుగులో మా అనుదిన ఆహారము 2022 వార్షిక ముద్రణతో, మరిన్నీ ధ్యానాంశములను ఎక్కువగా చదవండి మరియు ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని ధ్యానించండి. కేవలం 150 రుపాయలలో, ప్రతిరోజూ స్థిరంగా ప్రభువును వెతకడంలో అర్థవంతమైన మార్గాన్ని అందిస్తూ ఇది మీకు సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, మీ పరిస్థితి ఏమైయునప్పటికీ, ప్రతిరోజూ ఆయనతో సమయం గడపడం ద్వారా మిమ్మల్ని మీరు కోరుకునే వ్యక్తిగా మార్చుకోగలరు!